Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు కోసం 15 కి.మీ. ప్రయాణం

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 9:05 AM కర్నూలుGeneral
ఓటు కోసం 15 కి.మీ. ప్రయాణం - Udayam
డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం గుడిపాడు పంచాయతీ పరిధిలోని బోయవాండ్లపల్లె గ్రామస్థులు ఓటు వేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 240 మంది ఓటర్లు ఉన్నా ప్రత్యేక పోలింగ్ కేంద్రం లేకపోవడంతో, సర్పంచి ఎన్నికల కోసం 15 కి.మీ. దూరంలోని గుడిపాడుకు, అసెంబ్లీ ఎన్నికలకు 11 కి.మీ. దూరంలోని పీఆర్ పల్లెకు వెళ్లాల్సి వస్తోంది. సరైన రవాణా సదుపాయం లేక వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్‌కు దూరమవుతున్నారు.

Comments

G
Loading comments...