ఓటమి అవమానంగా ఉంది: ఎమ్మెల్యే

పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ ఓటమి చెందడం తనకు అవమానంగా ఉందని ఎమ్మెల్యే థామస్ అన్నారు. బుధవారం పెనుమూరులో పార్టీ నాయకులతో సమావేశమై, 40 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్నా మూడు ఎంపీపీ, నాలుగు జడ్పీటీసీ స్థానాలను ఎందుకు గెలవలేకపోయామని ప్రశ్నించారు.
సర్పంచి ఎన్నికల్లోనైనా విజయం సాధించాలని సూచించారు. లేదంటే 2029లో తాను ఎమ్మెల్యేగా ఉండనని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
