Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఒంగోలులో భారీ దోపిడీ.. 2 కిలోల బంగారం చోరీ!

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 1:10 PM ప్రకాశం General
ఒంగోలులో భారీ దోపిడీ.. 2 కిలోల బంగారం చోరీ! - Udayam
ఒంగోలులో బుధవారం ఉదయం దుండగులు భారీ దారి దోపిడీకి పాల్పడ్డారు. కోయంబత్తూరు నుంచి నగల దుకాణాలకు బంగారం తీసుకొస్తున్న వ్యాపారులను ఉపాస్‌ ఆస్పత్రి సమీపంలో అడ్డగించారు. ఆటో నుంచి బలవంతంగా దించి కారులో ఎక్కించుకుని దక్షిణ బైపాస్‌ సమీపంలోని డీ6 ఎక్సోటికా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వ్యాపారులపై దాడి చేసి సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.

Comments

G
Loading comments...