వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో వరుస దొంగతనాలతో ప్రయాణికులు హడలిపోతున్నారు. శనివారం కొండపి మండలానికి చెందిన ఓ మహిళ బ్యాగులోని బంగారు చైన్ చోరీకి గురైంది. సోమవారం దర్శికి చెందిన హనుమాయమ్మ బస్సు ఎక్కుతుండగా పర్సులోని రూ.13 వేల నగదు చోరీ చేశారు.
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. పలువురు ప్రయాణికులు బస్టాండ్‌లో నిఘా పెంచాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

