Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూపూడి వద్ద వ్యాన్‌ ప్రమాదం.. ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:47 AM కృష్ణా జిల్లాGeneral
జూపూడి వద్ద వ్యాన్‌ ప్రమాదం.. ఎమ్మెల్యే పరామర్శ - Udayam
హైదరాబాద్‌ వనస్థలిపురం నుంచి గుడివాడ మానికొండకు వెళ్తున్న ఓమ్నీ వ్యాన్‌ ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద సోమవారం రాత్రి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉన్నా ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అటుగా వెళ్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెంటనే స్పందించి ప్రయాణికులను పరామర్శించారు. అనంతరం వారిని మరో కారులో మానికొండకు పంపించారు.

Comments

G
Loading comments...