ఒలింపిక్ విజేతకు రక్షిత రామరాజ్ షాక్

రెండో రౌండ్‌లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యుఫెయిని 21-18, 24-22తో ఓడించి రక్షిత క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 45 నిమిషాల మ్యాచ్‌లో రెండో గేమ్‌లో 9-17తో వెనుకబడినా వరుసగా ఏడు పాయింట్లు సాధించి పుంజుకుంది.
పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ కూడా క్వార్టర్స్‌కు చేరాయి. మహిళల డబుల్స్‌లో గాయత్రి-ట్రీసా ఓడిపోయారు.
Comments
Loading comments...
