వార్తలకు తిరిగి వెళ్లండి

గురువారం రాత్రి కురిసిన వర్షానికి వరంగల్ నగరంలోని మండిబజార్‌లో ఓ పాత ఇంటి గోడ కూలిపోయింది. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
గోడ ఇటుకలు, మట్టి డ్రైనేజీ కాలువతోపాటు రోడ్డుపై పడటంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న మునిసిపల్ సిబ్బంది శుక్రవారం ఉదయం మట్టిని తొలగించారు.
Comments
Loading comments...

