Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలికల దుకాణాలకు పాత అద్దెలే

Follow Udayam on Google
రాజిత దేవి Aug 01, 2026 6:05 PM మెదక్General
పురపాలికల దుకాణాలకు పాత అద్దెలే - Udayam
పురపాలికల్లో వాణిజ్య దుకాణాల అద్దెలు ఏళ్లుగా పెరగకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో పాత అద్దెలతోనే దుకాణాలు కొనసాగుతున్నాయి. ప్రతి మూడేళ్లకోసారి టెండర్లు నిర్వహించి అద్దెలు పెంచాల్సి ఉన్నా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మెదక్‌లోని కొన్ని దుకాణాలు దశాబ్దాలుగా అదే అద్దెలతో కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...