Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకటో తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తున్నాం - ఎమ్మెల్యే

Follow Udayam on Google
Devendra Oct 01, 2026 9:05 AM తూర్పుగోదావరిఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి మండలం రామవరం పంచాయతీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెలా 1న క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తున్నామని, అనపర్తి మండలంలో 9,825 మందికి రూ.4.27కోట్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...