Udayam Digital
Menu

ఒకే బైక్‌పై 107 చలాన్లు

Shruthi Nov 19, 2026 9:26 AM హైదరాబాద్General
ఒకే బైక్‌పై 107 చలాన్లు - Udayam Digital
వనస్థలిపురంలో వాహనాల తనిఖీల సందర్భంగా ట్రాఫిక్‌ పోలీసులు భారీగా పెండింగ్‌లో ఉన్న చలాన్లను గుర్తించారు. ఏపీ 28ఎస్‌ 6114 నంబర్‌ గల ద్విచక్రవాహనంపై 107 చలాన్లు ఉండగా, మొత్తం జరిమానా రూ.24,645గా నమోదైంది. ఈ వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. చంచల్‌గూడకు చెందిన అజహర్‌ ఈ బైక్‌ యజమానిగా గుర్తించినట్లు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...