వార్తలకు తిరిగి వెళ్లండి

కట్కూర్‌లో నేతాజీ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒగ్గుడోలు కళా నృత్యాలు నిర్వహించారు. డీజే మోతలకు దూరంగా సంప్రదాయ జానపద కళలను ప్రోత్సహించడం అభినందనీయమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
కళాకారుల నృత్యాలు, డోలు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముసిని వీరాగౌడ్, శ్రీశైలం, మాల్ల రాజు, ప్రకాష్‌రెడ్డి, నగేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

