Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 2:40 PM మహబూబ్‌నగర్General
ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా శ్రీ శ్రీ బీరప్ప స్వామి ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం నూతన జిల్లా కమిటీని రాజాపూర్ బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొంగళ రాజు, గౌరవ అధ్యక్షుడిగా కొల్లూర్ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా ఆవ మహేందర్, కోశాధికారిగా గొరిగే నరేష్ తదితరులు ఎన్నికయ్యారు. కళాకారుల సంక్షేమం, ఒగ్గు కళ పరిరక్షణకు కృషి చేస్తామని నూతన కమిటీ తెలిపింది.

Comments

G
Loading comments...