Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్మెంట్‌ ముందే అనిశా వలలో పడ్డ అధికారి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 25, 2026 11:25 AM అనంతపురంGeneral
రిటైర్మెంట్‌ ముందే అనిశా వలలో పడ్డ అధికారి - Udayam
వారం రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న అనంతపురం జిల్లా దేవాదాయశాఖ ఏసీ గంజి మల్లికార్జున ప్రసాద్‌ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. చెక్కు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు అనిశాను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే దాడులు చేసి నిందితుడిని పట్టుకున్నారు. రిటైర్మెంట్‌కు సమీపంలో అధికారి అవినీతికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Comments

G
Loading comments...