Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్లుగా కొనసాగుతున్న కార్యాలయ భవన సమస్య

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 11:48 AM మహబూబ్‌నగర్General
నాలుగేళ్లుగా కొనసాగుతున్న కార్యాలయ భవన సమస్య - Udayam
ఉమ్మడి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ కార్యాలయ తరలింపు సమస్య నాలుగేళ్లుగా కొనసాగుతోంది. పాత కలెక్టరేట్‌ ప్రాంగణంలోని కార్యాలయాన్ని మార్చాలని అధికారులు సూచించినా ప్రత్యామ్నాయ భవనం దొరకలేదు. వర్షాలకు కార్యాలయంలోకి నీరు చేరి కీలక దస్త్రాలు తడుస్తున్నాయి. ప్రభుత్వ భవనం కేటాయిస్తే తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...