Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 22న హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 3:26 PM హైదరాబాద్General
నవంబర్ 22న హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్ - Udayam
తెలంగాణ ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్ నవంబర్ 22న హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో జరిగే పీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. 23న కూడా హైదరాబాద్‌లో ఉండి సీఎం, మంత్రులు, సీనియర్ నేతలతో సందీప్ భేటీ కానున్నారు.

Comments

G
Loading comments...