Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ఢీకొని నర్సు మృతి

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 10:24 AM జనగామ General
రైలు ఢీకొని నర్సు మృతి - Udayam
జనగామ జిల్లా నేరెడుమెట్లకు చెందిన మానస(20) వందేభారత్‌ రైలు ఢీకొని మృతిచెందింది. మౌలాలి హౌసింగ్‌బోర్డులో నర్సుగా పనిచేస్తున్న ఆమె తల్లిదండ్రులతో కలిసి జనగామలో కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో మౌలాలి చేరుకున్న అనంతరం రైలు దిగి పట్టాలు దాటుతుండగా వందేభారత్‌ ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Comments

G
Loading comments...