వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ జి మండల కేంద్రంలోని 13వ వార్డులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీరు వెళ్లే దారిలేక కొన్ని ఇళ్లలోకి మురికి నీరు చేరుతుండటంతో నివాసితులు ఆందోళన చెందుతున్నారు. మురుగు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి, రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

