వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం రాయపేటలోని శ్రీ సూర్య చింతామణి టవర్స్‌లో చోరీ జరిగింది. ఈ నెల 7న ఫ్లాట్ నంబర్ 202 తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన గుర్తుతెలియని దొంగలు సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు.
ఊరి నుంచి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బాధితుడు కృష్ణ శాస్త్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

