Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా లేకుంటే నో ఫ్యూయల్‌

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 04, 2026 9:31 PM జాతీయంGeneral
బీమా లేకుంటే నో ఫ్యూయల్‌ - Udayam
థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనాలు తిరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం నిరాకరించేలా పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టాలని కేంద్రాన్ని సూచించింది. మోటార్‌ వాహనాల చట్ట నిబంధనలు అమలు కావడం లేదని ధర్మాసనం పేర్కొంది. దేశ రహదారులపై సగానికిపైగా వాహనాలకు బీమా లేకపోవడం తీవ్ర ఆందోళనకరమని తెలిపింది.

Comments

G
Loading comments...