Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు హైకోర్టు బ్రేక్

సంజయ్ రెడ్డి Jul 20, 2026 6:42 PM హైదరాబాద్about 15 hours ago
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు హైకోర్టు బ్రేక్ - Udayam Digital
శంషాబాద్ బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములపై తెలంగాణ హైకోర్టు కీలక విచారణ జరిపింది. వివాదాస్పదంగా మారిన ఆ 28 ఎకరాల భూమిలో ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమ భూమిని కాపాడుకునేందుకు నలుగురు రైతులు దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...