వార్తలకు తిరిగి వెళ్లండి

నంబులపూలకుంట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారానికి 14వ రోజుకు చేరుకున్నాయి. అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో వీఆర్ఏలు దీక్షలు కొనసాగిస్తున్నారు.
అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించి జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

