వార్తలకు తిరిగి వెళ్లండి

నంబుల పూలకుంట మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 15వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నా తమను ప్రభుత్వాలు గుర్తించడం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించి, జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

