వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో నిర్మించిన యోగా కేంద్రం పర్యవేక్షణ లేక నిరుపయోగంగా మారింది.
ప్రతిరోజూ యోగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా, శిక్షకులు లేకపోవడంతో భవనం వృథాగా దర్శనమిస్తోంది. నిధులు వెచ్చించి నిర్మించిన కేంద్రాన్ని తక్షణమే వినియోగంలోకి తెచ్చి, యోగా శిక్షకుడిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

