Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

Follow Udayam on Google
సందీప్ Jul 11, 2026 12:00 PM నిర్మల్ General
నిర్మల్‌లో ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ - Udayam
నిర్మల్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నివారణకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. బస్టాండ్ పరిసరాలు, మయూరి హోటల్ జంక్షన్, మంచిర్యాల చౌరస్తా, ఈద్గాహ్ చౌరస్తా ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్టాండ్, మినీ ట్యాంక్ బండ్ సమీపంలో రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని హెచ్చరించి తోపుడు బండ్లను తొలగించారు.

Comments

G
Loading comments...