వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శనివారం రెండో రోజు కొనసాగింది. బొజ్జ గణపయ్య విగ్రహాలను భాజాభజంత్రీల నడుమ పట్టణ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు.
గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణ వీధులు జనసంద్రంగా మారాయి. డీజే పాటలు, భక్తి గీతాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో సందడి చేశారు. గణపతి బొప్పా మోరియా నినాదాలతో నిర్మల్ పట్టణం మారుమోగింది.
Comments
Loading comments...

