వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన చెట్లు ఎండాకాలాన్ని తలపిస్తూ బోసిపోతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బెల్గాం రోడ్డుకు ఇరువైపులా, అటవీ ప్రాంతంలో టేకు చెట్ల ఆకులు భారీగా రాలిపోతున్నాయి. పురుగుల ఉధృతి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పచ్చదనంతో నిండాల్సిన అడవి ఇలా ఎండిపోవడంపై సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి, నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

