Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌కు మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సన్మానం

Follow Udayam on Google
Devender Bale Sep 20, 2026 8:43 PM జగిత్యాలGeneral
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌కు మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సన్మానం - Udayam
జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పడాల సురేష్ తన ఆటోలో ప్రయాణించిన మహిళ మరిచిపోయిన అర తులం బంగారం, రూ.1,000 నగదును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌ను సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల యువజన నాయకులు హరీష్, బాలే చందు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...