వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాల్కల్ గ్రామ శివారులో నిజాంసాగర్ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లిన బత్తుల దశరథ్ (40) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
ఈ నెల 25న ఉదయం స్నానం చేస్తుండగా గల్లంతైన దశరథ్ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు జాలర్ల సహాయంతో గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం కాలువలో మృతదేహం లభ్యమైంది. భార్య వనజ ఫిర్యాదుతో ముగ్పాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

