వార్తలకు తిరిగి వెళ్లండి
పాలకొండ మండలం అన్నవరం గ్రామంలోకి శుక్రవారం వరద నీరు పోటెత్తింది. ఈ గ్రామానికి పక్కనే నాగావళి నది ఉంది. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్నందున నీరు గ్రామంలోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం గ్రామంతో పాటు పంచాయతీ కార్యాలయం, పీహెచ్సీ నీటమునిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు.
Comments
Loading comments...

