వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ ఆదేశాలతో రాయచోటి పట్టణంలో రాత్రివేళ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 10:30 గంటల తర్వాత షాపులు మూసివేయాలని ఆదేశించారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యవసర పరిస్థితులు మినహా రాత్రివేళల్లో ఎవరూ బయట తిరగరాదని సూచించారు.
Comments
Loading comments...

