వార్తలకు తిరిగి వెళ్లండి

కోనరావుపేట మండలం మామిడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోవడంతో నిద్రలోనే మహిళ మృతి చెందింది.గ్రామానికి చెందిన గుమ్మడి లక్ష్మి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందింది.
గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఇల్లు మరింత బలహీనపడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
Comments
Loading comments...

