Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరిలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు షురూ

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:31 AM చిత్తూరుGeneral
నగరిలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు షురూ - Udayam
నగరి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు సిద్ధార్థ కళాశాలలో ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. మొత్తం 40 వార్డులకు గాను నాలుగు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 36 వార్డులకు కౌంటింగ్ చేపట్టారు. 18 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసి రెండు రౌండ్లలో లెక్కింపు నిర్వహించనున్నారు. కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...