వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రం శివారులోని పంట పొలాల్లో ఆరు నెలల నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. రైతు పొలం పనులు చేస్తుండగా మృతదేహం కనిపించి పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నాగరాజు, వైద్యాధికారి సాయికుమార్ శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. గర్భస్రావం (అబార్షన్) చేసి మృతదేహాన్ని పొలంలో పడేసి ఉంటారని వారు ప్రాథమికంగా నిర్ధారించారు.
Comments
Loading comments...

