వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ఓదెలలో రూ.75 లక్షలతో నిర్మించిన నూతన తహసిల్దార్ భవనాన్ని ప్రభుత్వ విప్ విజయరామరావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. 40 ఏళ్ల తర్వాత కార్యాలయం సొంత భవనంలోకి మారింది.
ఈ సందర్భంగా సూపర్ ఎల్‌నినో పరిస్థితుల రీత్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో భూ పునఃసర్వే చేపడుతున్నామని, దీనివల్ల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

