వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్యవివాహాల నివారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనను పరిశీలిస్తోంది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా కొత్త రూల్ తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అదితి తట్కరే బుధవారం వెల్లడించారు.
ఈ విధానం ద్వారా వివాహ వయస్సును సులభంగా నిర్ధారించవచ్చని, తద్వారా చట్టవిరుద్ధమైన బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

