Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్లకు దరఖాస్తులు.. దళారులను నమ్మొద్దు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:22 AM విజయనగరంGeneral
కొత్త పింఛన్లకు దరఖాస్తులు.. దళారులను నమ్మొద్దు - Udayam
ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకంలో నూతన పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి ఈనెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రామ్‌సుందర్‌ రెడ్డి తెలిపారు. అర్హులు స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పింఛన్ల మంజూరు విషయంలో ఎలాంటి మధ్యవర్తులు, దళారులను నమ్మవద్దని తెలిపారు. కేవలం స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందిని మాత్రమే సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...