వార్తలకు తిరిగి వెళ్లండి

బిజీ జీవనశైలికి అలవాటు పడిన నేటి తరం నోరూరించే రుచితో పాటు శరీరానికి పోషకాలను అందించే, క్షణాల్లో తయారయ్యే మరియు ఆకర్షణీయమైన ప్యాకింగ్ కలిగిన ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతోంది. వినియోగదారుల ఈ సరికొత్త అవసరాలకు అనుగుణంగా ఆహార పరిశ్రమలోని ఆధునిక ట్రెండ్స్‌ను ఒకే చోటికి చేరుస్తూ హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ‘ఫుడ్ ఏ ఫెయిర్ 2026’ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ నెల 2న ప్రారంభమై శనివారంతో ముగిసిన ఈ ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వందకు పైగా అంకుర (స్టార్టప్) సంస్థలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.
Comments
Loading comments...

