Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామమందిర పూజారులకు కొత్త వస్త్ర నిబంధన

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 11, 2026 10:10 AM ఆల్ ఇండియా జాతీయ
రామమందిర పూజారులకు కొత్త వస్త్ర నిబంధన - Udayam
అయోధ్య రామమందిర పూజారులు ఇకపై గర్భగుడిలోకి ప్రవేశించే సమయంలో రామానందాచార్య సంప్రదాయం ప్రకారం కుట్టని పసుపు రంగు వస్త్రాలు ధరించనున్నారు. సిల్క్‌తో తయారైన కుట్టని ఉత్తరీయాన్ని కూడా ధరించనున్నారు. చలికాలంలో ఇదే తరహా ఉన్ని వస్త్రాలను ఉపయోగించనున్నారు. ప్రాచీన వైష్ణవ ఆచారాలకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు ఝూలనోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...