వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ గచ్చిబౌలిలో పారిశ్రామికవేత్త ఇంట్లో రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన నేపాలీ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల క్రితం పనిలో చేరిన కమలా షాహీ, విమల్ షాహీ ఈ చోరీకి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో నేపాల్ సరిహద్దు వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి దొంగిలించిన మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

