వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో భారీ వర్షాలకు నీరు చేరిన ప్రాంతాలను నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. మద్రాస్ బస్టాండ్, ఎస్ 2 సినిమా హాల్ పరిసరాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. ఆయన వెంట ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

