వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం సెలవు దినం కావడంతో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.
భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, జలమండలి తాగునీరు అందిస్తోంది. గణనాథుని దివ్యరూపాన్ని తిలకించేందుకు విపరీతమైన తాకిడి కనిపిస్తోంది.
Comments
Loading comments...

