వార్తలకు తిరిగి వెళ్లండి

APEAP సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ముగిసినా నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ఆశించిన స్థాయిలో జరగలేదు. జిల్లాలోని 13 కళాశాలల్లో 10,147 సీట్లకు గాను 5,275 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
మూడు కళాశాలల్లో 90 శాతానికి పైగా సీట్లు నిండగా, రెండు కళాశాలల్లో 10 శాతం కూడా భర్తీ కాలేదు. కౌన్సెలింగ్ జాప్యంతో విద్యార్థులు ఇతర రాష్ట్రాల వైపు వెళ్లారని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నారు.
Comments
Loading comments...

