వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ‘అంగన్వాడీ ఉత్సవ్’ ప్రారంభం కానుంది. జిల్లా ICDS PD నాగ శైలజ తెలిపిన వివరాల ప్రకారం, సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అక్టోబర్ 7 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి.
ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మూడు రోజులపాటు పోషకాహారం, మాతృ-శిశు సంరక్షణపై అవగాహన కల్పించనున్నారు. లబ్ధిదారుల అనుభవాలను వివరించడంతో పాటు తల్లులు, అంగన్వాడీ కార్యకర్తలను సన్మానించనున్నారు.
Comments
Loading comments...

