వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబంది, లాడ్జి తనిఖీల్లో 244 కేసులు నమోదు చేసి రూ.1,10,390 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో 240 మంది సిబ్బందితో తనిఖీలు చేపట్టారు.
28 లాడ్జిలను తనిఖీ చేసి 17 ఓపెన్ డ్రింకింగ్, 21 డ్రంక్ అండ్ డ్రైవ్, 206 MV Act కేసులు నమోదు చేశారు. క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

