వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనీ నెహ్రూ నగర్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నెహ్రూ యువ మిత్ర సంఘం ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.
పండుగలు సోదరభావం, శాంతిసామరస్యాలను పెంపొందిస్తాయని, ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

