వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దర్శనానికి వచ్చే వాహనాలను పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
వాహనాల రద్దీ నియంత్రణకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. ఈ ఆంక్షలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

