Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీకేజీ: కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 20, 2026 6:45 PM సంగారెడ్డిGeneral
నీట్ పేపర్ లీకేజీ: కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి - Udayam
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. దిల్లీలో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, విద్యార్థులపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ సమీపంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరంకుశ విధానాలు మానుకుని, ఉద్యమకారులతో తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...