Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నేషన్‌ బిల్డర్స్‌’ అవార్డుకు ప్రభుత్వ లెక్చరర్‌ ఎంపిక

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:42 PM అనకాపల్లి General
‘నేషన్‌ బిల్డర్స్‌’ అవార్డుకు ప్రభుత్వ లెక్చరర్‌ ఎంపిక - Udayam
ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్‌ విభాగాధిపతి డా. పి.పద్మప్రియకు ప్రతిష్ఠాత్మక ‘నేషన్‌ బిల్డర్స్‌’ అవార్డు లభించింది. ఉన్నత విద్యా విభాగంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. వీడియం ఇండియా ఆన్‌ ద మూవ్‌ 34వ వార్షికోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డు అందించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డా. ప్రేమచంద్రశేఖర్‌, అధ్యాపక సిబ్బంది పద్మప్రియను అభినందించారు.

Comments

G
Loading comments...