Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల నియంత్రణ లక్ష్యంగా ముందుకు బైంసా ఏఎస్పీ సాయికిరణ్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 31, 2026 10:29 AM నిర్మల్General
నేరాల నియంత్రణ లక్ష్యంగా ముందుకు బైంసా ఏఎస్పీ సాయికిరణ్ - Udayam
నేరాల నియంత్రణే లక్ష్యంగా బైంసా ఏఎస్పీ సాయికిరణ్‌ రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు తానూర్ మండలంలోని కోలూర్ గ్రామంలో సోమవారం వేకువజామున పోలీసులు విస్తృతంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఏఎస్పీ సాయికిరణ్‌ స్వయంగా పాల్గొని తనిఖీలను పర్యవేక్షించారు. ముథోల్ సీఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు గ్రామంలోని ఇళ్లను, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.

Comments

G
Loading comments...