వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట (M) గొయిది గ్రామానికి సమీపంలో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. బలమైన ఈదురుగాలులు, వర్షం కారణంగా పొలంలో సాగు చేసిన మొక్కజొన్న మొక్కలు పెద్దఎత్తున నేలకొరిగాయి.
పంట చేతికొచ్చే దశలో ఉండటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట మొత్తం నేలవాలడంతో దిగుబడి తగ్గే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

